Police Detected Actress Sowmya Janu attacked Traffic Police: బంజారా హిల్స్‌లో ట్రాఫిక్ హోం గార్డు మీద మహిళ దాడి కేసులో జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించారు బంజారా హిల్స్ పోలీసులు. సౌమ్య జాను పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిందని తెలుస్తోంది. ఆమె తెలుగులో తడాఖా, చందమామ కథలు, లయన్ వంటి సినిమాల్లో నటించినట్టు చెబుతున్నారు. తాజాగా ఆమె బంజారా హిల్స్‌లో ట్రాఫిక్ హోమ్ గార్డు మీద దాడి చేసింది. నిజానికి దాడి జరిగిన సమయంలో ఒక మహిళ ఎవరో దాడి చేసింది అనుకున్నారు. కానీ ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి వెళ్లి తాను రాంగ్ రూట్ లో వెళ్లాను తప్ప తన తప్పు ఏమీ లేదని, తన వాదన వినిపించింది.
Varun Tej: వార్ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ అందుకే : వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ
దీంతో జాగ్వార్ కారు నడిపి నటి సౌమ్య జాను రాంగ్ రూట్ లో వచ్చి తనను ఆపిన హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిందని పోలీసులు గుర్తించారు. ఇక ఆమె తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్‌లో వెళ్లితే తప్పేంటని రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లడం సర్వ సాధారణం అని తనలాంటి సెలెబ్రిటీనే అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. తనను హోం గార్డు ముం* అంటూ దూషించాడు అని అందుకే తాను అతని మీద ఫైర్ అయ్యానని ఆమె చెబుతోంది. అంతేకాదు తాను కూడా హోంగార్డ్ మీద కేసు పెడతా అంటూ వ్యాఖ్యలు చేసింది. తనను ఇప్పటి దాకా విచారణకు పిలవలేదని ఆమె కామెంట్ చేసింది. అయితే ఆమె తాజా ఇంటర్వ్యూతో దాడి చేసిన ఆమెను గుర్తించిన పోలీసులు చట్టం ప్రకారం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.