Varun Tej: వార్ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ అందుకే : వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Interview for Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.
Also Read
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
- AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ సినిమాని కొత్త దర్శకులతో చేయడం ఒక సవాల్ అనిపించలేదా ?
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ లో చాలా పాషన్ వుంది. ఏదో ఒక సినిమా చేసేయాలనే ఆలోచన తనలో లేదు. ప్రత్యేకంగా ఈ కథనే నా ద్వారా చెప్పాలని అనుకున్నాడు. ఆ పాషన్, నమ్మకం తనలో కనిపించాయి. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. అంతకుముందు తను చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా వైరల్ అయ్యింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై సినిమా చేయాలనుకున్నపుడు ఇంకా కావాల్సిన సమాచారం ఇస్తామని వారు చెప్పారు. ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో వుంది.
వార్ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
ఏరియల్ వార్ అంటే వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటాయి కదా.. ఒక నటుడిగా ఇది మీకు సవాల్ గా అనిపించిందా?
అంతరిక్షం సినిమా సమయంలో తొలిసారి వీఎఫ్ఎక్స్ ని ఎక్స్ పీరియన్స్ చేశా. గ్రీన్ స్క్రీన్ చూపించి అక్కడే చంద్రుడు ఉన్నాడని చెబితే కాస్త ఇబ్బందిగా అనిపించింది(నవ్వుతూ). రానురాను అది అలవాటైయింది. ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రొజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే రియల్ గా ప్లయిట్ నడిపినట్లే వుంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి వుంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి. ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు. రుద్ర పాత్రతో అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.
హిందీలో చేయడం ఎలా అనిపించింది?
హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి( నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం.
హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి ?
మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్రపై చాలా ఫోకస్ గా వుంటుంది. రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది.
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ?
మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అనుకున్నారు. ఇందులో పాటలు ఎమోషనల్ గా వుంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా వుంటుంది.
‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా మీరు చేయడంపట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు?
టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్ ని కలవడం జరిగింది. ఆయన సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. బావుంది, గుడ్.. ఇంతవరకే వుంటుంది ఆయన రియాక్షన్. అలాంటి ఆయన ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ ని ఐదారుసార్లు చూశాను. చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇలా చెప్పడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు బాబాయ్ కి చాలా ఇష్టం.
‘మట్కా’ సినిమా ఎలా వుండబోతుంది?
మట్కా లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది మంచి కమర్షియల్ రివెంజ్ డ్రామా.
తాజావార్తలు
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!