Prasanth Varma: ‘హను-మాన్’ వాయిదా, త్వరలో కొత్త విడుదల తేదీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanu-Man: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ లో చూపిన విధంగా, ‘హను-మాన్’ టాప్-నాచ్ విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతోంది. ఈ చిత్రాన్ని మొదట వేసవిలో మే 12న విడుదల చేయాలని భావించారు. అయితే, అది వాయిదా పడింది. హ్యూజ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ ఈ ఆలస్యానికి కారణమని మేకర్స్ చెబుతున్నారు. దీని గురించి మాట్లాడుతూ, “టీజర్ కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ సినిమాలతో సమానంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. టీజర్ లో ప్రేక్షకులు చూసింది ఫైనల్ ప్రోడక్ట్ కి సాంపిల్ మాత్రమే. ఇటీవల వచ్చిన ఆర్ట్‌వర్క్ తో కూడిన హనుమాన్ చాలీసా కూడా భారీ స్పందన వచ్చింది” అని అన్నారు. ‘హనుమాన్’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన అపరిమితమైన ప్రేమ తమ మనసుని హత్తుకుందని, దీంతో సినిమా విషయంలో తమ పై బాధ్యత మరింత పెరిగిందని, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామ’ని దర్శక నిర్మాతలు హామీ ఇస్తున్నారు.
Read Also: Balineni Srinvas Reddy: నేను టికెట్స్ ఇప్పించినవాళ్ళే నాపై ఫిర్యాదు చేశారు
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘హను-మాన్’ అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ గా రిలీజ్ కానుంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!