PKSDT: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. అనే పాట పాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అరెరే.. అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అసలే మామఅల్లుళ్ళ మల్టీస్టారర్.. పవన్ దేవుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ హైప్ ను ఓ రేంజ్ లో తీసుకొచ్చి పెట్టాయి. ఎప్పటినుంచో దేవుడు మీద టైటిల్స్, పవర్ ఫుల్ గా పెడతారని.. అధికారికంగా అనౌన్స్ చేసే రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఒక టైటిల్ వచ్చింది. అదే సినిమాకు ఫైనల్ చేసారని టాక్ నడుస్తోంది. దీంతో మేము ఏం అనుకున్నాం.. మీరేం చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న PKSDT గురించి.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుంది.
Suman: రజినీకాంత్ స్పీచ్ లో తప్పు లేదు.. చంద్రబాబు టైమ్ బ్యాడ్ అంతే
గోపాల గోపాల తరువాత పవన్ ఇందులో దేవుడుగా కనిపించనున్నాడు. తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతాం కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ టైటిల్ కాదని, ఇంకో టైటిల్ ను ఫిక్స్ చేశారని నిన్నటి నుంచి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మల్టీస్టారర్ కకు “బ్రో” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో పవన్ టైమ్ గా కనిపిస్తున్నాడు. ఆయనను టైమ్ అని పిలవలేక తేజ్.. బ్రో అని పిలుస్తాడట. అందుకే టైటిల్ కు జస్టిఫికేషన్ లా బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టైటిల్ పై పవన్ ఫ్యాన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ రేంజ్ లో ఉహించుకొంటే.. ఇలా సింపుల్ గా బ్రో అని చెప్పుకొచ్చేశారేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.