సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్ నుంచి రావడంతో రజినీ ప్రమోషన్స్ కి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
ఇక నయన్ ఎటువంటి ప్రమోషన్స్ కి హాజరు కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మిగతా హీరోయిన్లు కీర్తి సురేష్, సీనియర్ హీరోయిన్లు కుష్బూ, మీనా ఈ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ‘పెద్దన్న’ ప్రమోషన్ మొదలు అంటూ ముగ్గురు ముద్దుగుమ్మలు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పవర్ ఫ్యాక్డ్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.