OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేసింది. వాషి ఓ వాషీ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను యూట్యూబ్ కొన్ని క్షణాల క్రితమే రిలీజ్ చేశారు.
Read Also : Teja Sajja : మూడు సీక్వెల్స్.. అప్డేట్లు ఇచ్చిన తేజ
ఇందులో పవన్ కల్యాణ్ తన హుషారెత్తించే గొంతుతో ఆకట్టుకున్నారు. విలన్ ఓమీకి ఏదో వార్నింగ్ ఇస్తూ పాడిన పాటలాగా ఉంది. నీ లాంటి ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు.. మా తాత చెప్పిన మాట చెబుతాను విను అంటూ ఈ పాటను మొదలుపెడుతాడు పవన్ కల్యాణ్. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
Read Also : K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..