Pawan Kalyan: ‘అలీతో సరదాగా’ టాక్ షోకు గెస్టుగా పవర్‌స్టార్.. ఇది నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓటీటీ, టీవీ టాక్ షోలతోనూ బిజీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో పవన్ పాల్గొంటారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ బాలయ్య టాక్ షోకు హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.
Read Also: Samantha: షాకింగ్.. సమంతకు అరుదైన వ్యాధి
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
మరోవైపు పవన్ కళ్యాణ్ తన మిత్రుడు అలీ హోస్ట్ చేస్తున్న టాక్ షోకు కూడా హాజరవుతారని ఫిలింనగర్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. అలీ ప్రస్తుతం ఈటీవీలో అలీతో సరదాగా అనే టాక్ షోను నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ టాక్ షోకు హాజరయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వంలో అలీ కీలక పదవి పొందారు. ఆయనకు సోషల్ మీడియా సలహాదారుగా ఏపీ సీఎం జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. అటు జగన్, పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దత్తపుత్రుడు అంటూ పదే పదే పవన్‌ను సీఎం జగన్ విమర్శిస్తున్నారు. పవన్ కూడా జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను అలీ ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. నిజంగానే అలీ షోకు పవన్ హాజరైతే మీడియాలో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మరి పవన్ అలీ షోలో పాల్గొంటారో లేదో అన్న విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!