Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..
- సినిమా ఆలస్యానికి నేనే కారణమన్న హరీష్ శంకర్..
- పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం గొప్ప అనుభవం..
- ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. సినిమా అనుకున్న సమయం కంటే ఆలస్యమైందని మీ అందరికీ తెలుసు. దీనికి కారణం మరెవరో కాదు, నేనే. మొదట ఈ కథను కాలేజ్ బ్యాక్‌డ్రాప్ అనుకున్నాను, ఆ తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేశాను. ‘ఖుషి’ తరహాలో సినిమాను ఎక్స్టెండ్ చేయాలని భావించినా, అది కుదరలేదు. సినిమా ఆలస్యానికి నా నిర్ణయాలే ప్రధాన కారణం. అయితే.. అదే సమయంలో సినిమాను వేగంగా పూర్తి చేయడానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను. ఈ ప్రయాణంలో నిర్మాతలు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. నాపై నమ్మకం ఉంచి అన్ని విధాలా సహకరించారు. రోజుకు 1200 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ జరపడం మామూలు విషయం కాదు.. దానికి నిర్మాతల మద్దతు ఎంతో ఉందన్నారు.
Also Read
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..
‘నేను ఒక రకమైన లోలో ఉన్న సమయంలో.. పవన్ కళ్యాణ్ దేవుడిలా వచ్చి నన్ను పిలిచి, ధైర్యంగా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయమని ప్రోత్సహించారు. ఆ మాటలతో నా సందేహాలన్నీ తొలగిపోయాయి. నా గుండెలోతుల్లో పవన్ కళ్యాణే ఉన్నారు.. ఆయన నా గుండె ధైర్యం. ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ జరిగినట్టే, ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ నాకు అలాంటి గొప్ప అనుభవం ఎదురైందన్నారు. తెరపై పవన్ కళ్యాణ్ నా హీరో అయితే, తెర వెనుక దేవీ శ్రీ ప్రసాద్ నా హీరో. దేవీ బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రానికి థమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారన్నారు.
ఇక శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఆమె గొప్ప డ్యాన్సర్.. సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చూడముచ్చటగా ఉంటుంది.. ఆయన రెండు పాటల్లో అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. ఆయన డ్యాన్స్ చూడాలంటే మీరు మార్చి 19న ఖచ్చితంగా థియేటర్లకు రావాల్సిందే అన్నారు. చివరగా.. ‘ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది’ అంటూఈ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూడాలని హరీష్ శంకర్ కోరారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!