పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సముద్రఖని. తమిళ్ లో తనే నటించి, డైరెక్ట్ చేసిన ‘వినోదయ సిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని, తెలుగుకి తగ్గట్లు మార్పులు చెయ్యడానికి త్రివిక్రమ్ సాయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని లాంటి టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేస్తున్న ఈ రీమేక్ షూటింగ్ ఇటివలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ నెల రోజుల కన్నా తక్కువ కాల్ షీట్స్ ఇచ్చాడని సమాచారం. అందుకే ముందుగా పవన్ కళ్యాణ్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు.
Read Also: Virupaksha: ఇక వెయిటింగ్ లేదు మిత్రమా… అప్డేట్ లు మాత్రమే…
చిత్ర యూనిట్ షూటింగ్ అలా మొదలుపెట్టారో లేదో మెగా అభిమానులు సోషల్ మీడియాకి ఒక సూపర్ లీక్ ఇచ్చేశారు. సముద్రఖని సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు ఉన్న ఫోటోని షూటింగ్ స్పాట్ నుంచి లీక్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ జీప్ పై రెడ్ షర్ట్ లో స్టైల్ గా కూర్చోని ఉన్నాడు. సాయి ధరమ్ కూడా తేజ్ కూడా ఈ లీక్డ్ ఫోటోలో ఒక మూలాన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ స్టైల్ గా కనిపించడంతో ఫాన్స్ సోషల్ మీడియాలో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ ని చిత్ర యూనిట్ కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రీమేక్ షూటింగ్ అయిపోగానే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని స్టార్ట్ చెయ్యనున్నాడు. ఈ మార్చ్ మూడో వారం లేదా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.