Pawan Kalyan : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ అంశం రోజురోజుకూ రచ్చ లేపుతోంది. ఇప్పటికే పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో.. అల్లు అరవింద్, దిల్ రాజు బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. త్వరలోనే మరింత మంది బయటకు వచ్చి మాట్లాడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇందులో థియేటర్ల బంద్ అంశం, థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు, ఇతర అంశాలపై చర్చించారు. ఇందులో పవన్ కల్యాణ్ థియేటర్లలో ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్ల ధరలపై కీలక ప్రకటన చేశారు.
Read Also : Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్..!
థియేటర్లలో తినే పదార్థాల ధరలు విపరీతంగా పెంచడం వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్లు దూరం అవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అసలు ఎంత ధరలకు అమ్మాలి బయటకు ఎంతకు అమ్ముతున్నారు.. థియేటర్లలో కనీస వసతులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై పూర్తిగా విచారణ జరిపిస్తామని.. అన్నింటిపై నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు ఉన్న అన్ని అంశాలపై కూలంకుషంగా విచారణ చేస్తామన్నారు. అలాగే థియేటర్ల బంద్ అంశం వెనక ఎవరున్నారో కూడా తేల్చాలన్నారు. ప్రధాన మైన ఆరోపణలు వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Read Also : Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దు!