హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలని హిట్ ఇచ్చిన దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు కానీ OG డైరెక్ట్ చేస్తున్న సుజిత్ మాత్రం సాహూతో సాలిడ్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, OG సినిమాతో పంజా రేంజ్ సినిమా ఇస్తాడని ఫాన్స్ అంతా నమ్ముతున్నారు. తెలుగులో ఏ సినిమాకి లేనంత బజ్, OG సినిమాపై ఉంది. ముహూర్తం రోజు నుంచి ఎప్పటికప్పుడు OG నుంచి అప్డేట్స్ బయటకి వస్తూనే ఉన్నాయి. అర్జున్ దాస్ జాయిన్ అయ్యాడని, శ్రీయ రెడ్డి కాస్ట్ ఇన్ అయ్యిందని, విలన్ గా ఇమ్రాన్ హష్మీ లాక్ అయ్యాడని, పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుందని… ఇలా ఏప్రిల్ 15 OG రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేవలం రెండున్నర నెలలో ఇన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ 15న ముంబైలో OG ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ మే 3 నుంచి 9 వరకూ జరిగింది. ఈ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ కి తిరిగొచ్చిన OG టీం… మే 18 నుంచి మూడో షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు. దాదాపు నెలన్నర పాటు ఏ ధాటిగా జరిగిన ఈ షెడ్యూల్ తో OG మేజర్ పార్ట్ ని కంప్లీట్ చేసారు.
ఇంత పెద్ద షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్వీట్ వచ్చింది. 50% షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటూ మేకర్స్ నుంచి అప్డేట్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒక సినిమా రెండున్నర నెలల గ్యాప్ లో 50% షూటింగ్ కంప్లీట్ అవ్వడం అంటే మాటలు కాదు. సుజిత్ అసలు ఏ సినిమా చేస్తున్నాడో? మేకర్స్ నుంచి ఈ రేంజ్ అప్డేట్స్ బయటకి రావడం ఏంటో? సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు “ఫైర్ స్ట్రామ్” వస్తుంది అంటూ ఎలివేషన్స్ ఇవ్వడం ఏంటో? ఎవరికీ అర్ధం కావట్లేదు. రోజు రోజుకీ OG పై అంచనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున OG టీజర్ ని రిలీజ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ ఎగిరిపోవడం గ్యారెంటీ.
Action, Epicness & Drama…
A very productive three Schedules Done & Dusted. #OG Completes 50% of the shoot. Exciting weeks ahead 🤙🏻🔥#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/x2wkRvLkgB— DVV Entertainment (@DVVMovies) June 26, 2023