OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరీ లేట్ చేయకుండా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ రీ స్టార్ట్ అయింది. నెలలుగా పెండింగ్ లో ఉన్న షూటింగ్ లో రీసెంట్ గానే పవన్ అడుగు పెట్టారు. వరుసగా డేట్లు కూడా కేటాయించేశారు. ఒకే షెడ్యూల్ లో మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని ఇప్పటికే టీమ్ కు సూచించారు.
Read Also : HHVM : నైజాంలో వీరమల్లుకు భారీ డిమాండ్..!
ఇక ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ ‘ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25’ అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ఇప్పటి వరకు పవన్ ఒప్పుకున్న సినిమాలను అన్నింటినీ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాను జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు. రెండునెలల గ్యాప్ లోనే ఓజీ కూడా రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
Read Also : PM Modi: “మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాల అంశాలను ప్రస్తావించిన ప్రధాని మోడీ..