HHVM : పవన్ కల్యాణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జూన్ 12న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పాటలు మాత్రమే వచ్చాయి. కానీ అంతకు మించి ఇంకేం రాలేదు. త్వరలోనే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ మూవీ బిజినెస్ లెక్కలు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా నైజాం ఏరియాలో మూవీ బిజినెస్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
Read Also : Pakistan: “అమెరికా యుద్ధాల వల్ల లాభపడుతోంది”.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
పవన్ సినిమాలకు నైజాంలో ఉన్న డిమాండ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి నైజాం ఏరియాలో రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట. అంత ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా రెడీగానే ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో నైజాం ఏరియా చాలా పెద్దది. ఇక్కడి నుంచే 50 శాతం రెవెన్యూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ సినిమాలకు మంచి బిజినెస్ ఏరియా. పైగా హైదరాబాద్ లో పవన్ సినిమాలు హైదరాబాద్ లో బాగానే వసూళ్లు సాధిస్తుంటాయి. ఇక ఏపీ బిజినెస్ లెక్కలు అంతకు మించి ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Read Also : Tej Pratap Yadav: 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే, ఐశ్వర్యా రాయ్‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్..