Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో పవన్ పేరు మారుమ్రోగిపోతుంది. ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ .. ఇప్పటివరకు జనసేన పార్టీతోనే ముందుకు కొనసాగుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు ఈరోజు పొత్తులపై ఓపెన్ అయ్యాడు. ఎప్పటినుంచో జనసేన- టీడీపీ పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి .. జనసేన కలిస్తే టీడీపీ సంతోషంగా ఆహ్వానిస్తుందని చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు పవన్ పొత్తుల గురించి అధికారికంగా చెప్పింది లేదు. గత మూడు రోజుల క్రితం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు. ఇక నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేష్ కలిసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. ఇక అక్కడే ప్రెస్ మీట్ పెట్టి పవన్ పొత్తుల మీద క్లారిటీ ఇచ్చాడు.. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు గారి అరెస్ట్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయని, అందుకు ఈరోజే తాను నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Leader Re Release: సమయం చూసి దింపుతున్నట్టున్నారే.. ?
ఇక ప్రస్తుతం పవన్ నిర్ణయం కొంతమందికి నచ్చింది.. మరికొంతమందికి నచ్చలేదు. ఇవన్నీ పక్కన పెడితే .. రాజకీయాల వలన సినిమాలకు గ్యాప్ రావడం .. షూటింగ్ ఆగిపోవడం.. నిర్మాతలు నష్టాలపాలవ్వడం కూడా చూశారు. అయితే ఈసారి అలాంటివేమీ కాకుండా ఒకపక్క రాజకీయాలు చేస్తూనే.. ఇంకోపక్క సినిమాలు చేసేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిన్ననే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. దీన్నీ వెంటనే పూర్తిచేసి .. మిగతా సినిమాలను కూడా ఫినిష్ చేయాలనీ పవన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తరువాత డైరెక్ట్ గా పవన్ సెట్ కు వెళ్లనున్నాడని సమాచారం. దీంతో పవన్ ను చూసిన వారందరు.. కళ్యాణ్ బాబు.. ఎక్కడా తగ్గడం లేదుగా అంటూ చెప్పుకొస్తున్నారు. మరి పవన్ సినిమాల్లో విజయాన్ని అందుకున్నట్లు.. రాజకీయాల్లో కూడా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.