సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది బ్రో మూవీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండడేమో అనే అనుమానం చాలా మందిలో ఉండేది కానీ ఆ అనుమానాలని చెరిపేసాయి బ్రో మోర్నింగ్ షోస్. సినిమా స్టార్ట్ అయిన 10-15 నిమిషాలకే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండడం, ఆయన స్వాగ్ అండ్ స్టైల్ ని సముద్రఖని సూపర్బ్ గా వాడడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్లు అయ్యింది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ అంత స్టైల్ గా కనిపించడం, కామెడీ టైమింగ్ ని పూర్తిగా చూపించడం ఇదే మొదటిసారి అండ్ పవన్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ కి థమన్ ఇచ్చిన థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ అందరినీ శాటిస్ఫై చేసింది.
Read Also: Bro: ట్విట్టర్ రివ్యూ…
ఓల్డ్ సినిమాల రిఫరెన్స్ కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వింటేజ్ వైబ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే థియేటర్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మంచి జోష్ లో థియేటర్ నుంచి బయటకి వస్తాడు. ఆ రేంజ్ బొమ్మ చూపించారు బ్రో సినిమాతో. పవన్ కళ్యాణ్ మాములుగా కనిపిస్తేనే ఫ్యాన్స్ రచ్చ చేస్తారు అలాంటిది వింటేజ్ వైబ్స్ ఇచ్చే రేంజులో కనిపిస్తున్నాడు అంటే వర్షాలని కూడా లెక్క చేయకుండా థియేటర్స్ కి క్యూ కట్టడం గ్యారెంటీ. మరి పవన్ మేనియాని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ ఇస్తారో చూడాలి.