పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటించిన ‘బ్రో’ సినిమా కోసం మెగా అభిమానులు చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సముద్రఖని అండ్ టీమ్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈరోజు సినిమాని థియేటర్స్ లోకి తీసుకోని వచ్చారు. త్రివిక్రమ్ కలం పదును కూడా కలవడంతో బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ లో బిజీ అయిపోతూ ఉండడంతో, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా చూడడానికి థియేటర్స్ కి వచ్చారు. రీమేక్ కదా ఎలా ఉంటుందో అనుకున్న వారందరిని సైలెంట్ చేసేలా ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. బ్రో మూవీ ఎర్లీ మార్నింగ్ షోస్ దాదాపు అన్ని సెంటర్స్ లో కంప్లీట్ అయిపోయే సరికి డిజిటల్ స్పేస్ లో #BRO టాగ్ ట్రెండ్ అవుతోంది.
సినిమాని చుసిన ప్రతి ఒక్కరూ బాగుందనే ట్వీట్ చేస్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెట్ ఎస్సెట్స్ గా చేసుకోని బ్రో సినిమా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. రేసీ స్క్రీన్ ప్లే, సూపర్బ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పాత సినిమాల రెఫరెన్స్, పవన్ స్వాగ్ అన్నీ కలిసి బ్రో సినిమాని ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకునేలా చేసాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి థియేటర్స్ మోతమోగిపోయాయ్. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే పవన్ ఎంట్రీ ఉండడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ అండ్ స్టైలింగ్, ఆన్ స్క్రీన్ ఎనర్జీ పీక్ స్టేజిలో ఉండడంతో మెగా ఫ్యాన్స్ కి ఈరోజు పండగలా మారింది. ఓవరాల్ గా బ్రో సినిమా మార్నింగ్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, మరి లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.