ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ‘తెరి’ రీమేక్‌గా తెరకెక్కుతుందని అంటున్నారు కానీ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ మచ్ అవైటింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ అయిపోవడంతో పవర్ స్టార్ బ్రేక్ లో ఉన్నాడు. ఏప్రిల్ 18 నుంచి పవన్ కళ్యాణ్, సుజీత్ ‘ఓజి’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ ఉంటుంది. ఇక ఇప్పటికే వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు పవన్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాలతో పాటు పవన్ మరికొన్ని ప్రాజెక్ట్స్ ని డిస్కషన్ స్టేజ్ లో ఉంచాడు. ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ అవుతుందో అనేది సెట్స్ పైకి వెళ్లే వరకూ ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు, అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్, ఒక సీక్వెల్ కి ఓకే చెప్పాడట. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కి రీఎంట్రీ సినిమాగా నిలిచింది ‘వకీల్ సాబ్’ మూవీ.
ఈ మూవీతో దర్శకుడు వేణు శ్రీరామ్.. పవన్ ఫ్యాన్స్‌కి ఎలాంటి ఎలివేషన్స్ కావాలో, కొలతలు వేసుకోని మరీ చూపించాడు వేణు శ్రీరామ్. పింక్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇటీవలె పవన్‌తో మరో ప్రాజెక్ట్ ఉంటుందని ట్విట్టర్ ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇక ఇప్పుడు ట్విట్టర్ స్పేస్‌లో వేణు శ్రీరామ్.. ‘వకీల్ సాబ్’ రిలీజ్ అయి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ‘వకీల్ సాబ్ 2’ పై క్లారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నానని కన్ఫర్మ్ చేసాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో వకీల్ సాబ్ 2 ట్యాగ్‌ను ట్విట్టర్లో ఇండియా వైడ్‌గా ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఏదేమైనా ఫస్ట్ టైం పవన్ చేస్తున్న సీక్వెల్‌గా వకీల్ సాబ్ రికార్డ్ క్రియేట్ చేయనుంది.