HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పవన్ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా విశాఖపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన మొదటి గురువు సత్యానంద్ ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా సన్మానం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ తన గురువుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Also : HHVM : ఓజీకి ఉన్న క్రేజ్ వీరమల్లుకు ఎందుకు లేదు.. పవన్ ఆన్సర్ ఇదే..
అన్నయ్య చిరంజీవి నన్ను సత్యానంద్ గారికి అప్పగించారు. ఆయన్ను నేను చాలా ఇబ్బందులు పెట్టాను. చెన్నైలో నేను ఆయన్ను చాలా ఇబ్బందులు పెట్టాను. దాంతో ఆయన నన్ను విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ తన టీమ్ తో చాలా స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన నేర్పించిన విధానాల వల్లే నేను సిగ్గుపడటం తగ్గించుకున్నాను. ఒక విషయాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఆయన వల్లే నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. తన సినిమాల్లో అంతో ఇంతో నటన ఉందంటే దానికి కారణం సత్యానంద్ అంటూ తెలిపారు.
Read Also : HHVM : హరిహర వీరమల్లుకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?