HHVM : హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఐదేళ్లు కష్టపడ్డారు. మధ్యలో రెండేళ్ల పాటు మూవీ షూట్ ఆగిపోయింది. అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాల నడుమ.. ఎట్టకేలకు మూవీని రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం పవన్ వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కాగా ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఐదేళ్ల పాటు ఈ మూవీ షూట్ జరిగింది. పైగా పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ. పవన్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా.
Read Also : HHVM : వీరమల్లుకు ఆ రెండు జిల్లాల్లో భారీ వసూళ్లు..?
ఈ మూవీ కోసం తాను ఎంత తీసుకున్నాడో పవన్ స్వయంగా చెప్పాడు. తాజాగా రిపోర్టర్లతో మాట్లాడుతున్నప్పుడు రెమ్యునరేషన్ పై ప్రశ్న ఎదురైంది. పవన్ స్పందిస్తూ.. ఈ సినిమా కోసం నేను ఒక్క పైసా కూడా ఇంకా తీసుకోలేదు. అలా అని రెమ్యునరేషన్ తీసుకోను అని కాదు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బాగుంటే తీసుకుంటా. అదృష్టమో, దురదృష్టమో గానీ.. నాకు చాలా సినిమాలకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు. నిర్మాతల కష్టాలు ఏంటో నాకు తెలుసు. నేను వారికి ఎక్కువ గౌరవం ఇస్తాను. నా సినిమాలు చాలా సార్లు ఆడలేదు. అందుకే వాళ్లను నేను అడగలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కల్యాణ్. ఈ విషయంతో అంతా షాక్ అవుతున్నారు. పవన్ చాలా ఏళ్లు ఈ మూవీ కోసం కష్టపడినా.. ఇంకా తీసుకోకపోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏ హీరో అయినా ముందే రెమ్యునరేషన్ తీసేసుకుంటున్నారు. పవన్ ఇలా చేయడం నిర్మాతకు మేలే అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : HHVM : పవన్ ఎన్నడూ చేయని యాక్షన్ సీన్లు.. వీరమల్లులో అవే హైలెట్..