పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఇతర భాషల చిత్రాల రీమేక్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు క్రిష్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా చేస్తున్నాడు. తాజా బజ్ ఏమిటంటే దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. అయితే కథ విషయంలో అనిల్‌కి పవన్ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రావద్దని, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి తరహాలో ఏదైనా చేయమని పవన్ కోరినట్లు సమాచారం. యూత్ బాగా ఎంజాయ్ చేసే కొన్ని మాస్ సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఆసక్తికరమైన కామెడీ సినిమా చేయాలని పవన్ భావిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటికే రెడీ చేసిన స్క్రిప్ట్ లోనూ మార్పులు చేర్పులు సూచించాడని అంటున్నారు.
Read Also : చల్లని పూల్లో వెచ్చని మంటలు రేపుతున్న హాట్ బ్యూటీ
‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో అనిల్ రావిపూడి హీరోలను ఎలివేషన్ చేసిన తీరు అద్భుతం. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ రిక్వెస్ట్‌కు కట్టుబడి పవన్ కళ్యాణ్‌ని వైవిధ్యంగా తెరపై చూపించే కామెడీ సినిమాతో వస్తాడో లేదో చూడాలి. మరోవైపు పవన్ “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ “F3” చిత్రాన్ని 2022 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.