మెగా బ్రదర్ గా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడిగానే గుర్తించారు ఆడియన్స్. ఇక్కడి నుంచి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి హెల్ప్ అయిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నాం అంటే తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మనస్సే, ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, గగనానికి ఉదయం ఒకటే… లాంటి సాంగ్స్ తో తొలిప్రేమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవా ప్రాణం పోసాడు. బెస్ట్ ఫిలింగా నేషనల్ అవార్డుతో పాటు చాలా కేటగిరిల్లో నంది అవార్డుని గెలుచుకుంది తొలిప్రేమ సినిమా.
బాలుగా పవన్ కళ్యాణ్, అను పాత్రలో కీర్తి రెడ్డి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసారు. ముఖ్యంగా అను క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ కి ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు. అంతలా ఇంపాక్ట్ చూపించింది తొలిప్రేమ సినిమా. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారాడు. పవన్ కెరీర్ ని అంత టర్న్ చేసిన తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఈ జూన్ 30న తొలిప్రేమ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీరిలీజ్ ట్రైలర్ కూడా బయటకి వచ్చి ఫాన్స్ తో పాటు యూత్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఈ క్లాసిక్ లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడని ఆడియన్స్, జూన్ 30న థియేటర్స్ కి వెళ్లి తొలిప్రేమ సినిమాని సూపర్ హిట్ చెయ్యడం గ్యారెంటీ.