Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pavala Shyamala: టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది పావలా శ్యామల. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పడంలేదని వాపోయింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్.. పావలా శ్యామలకు కొన్ని లక్షలు ఇచ్చాడని, దానితోనే ఆమె బ్రతుకుతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పావలా శ్యామల.. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కూడా. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం గురించి చెప్పుకొచ్చింది. పవన్ తనకు ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని.. అంతకుమించి తనకోసం ఆయన పరిగెత్తుకుంటూరావడం చాలా గొప్ప విషయమని చెప్పింది. ఈ ఓల్డ్ వీడియో ప్రస్తుతం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.
Gowthami: ‘అన్నీ మంచి శకునములే’ ప్రేక్షకులకు ఓ మంచి బహుమతి!
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
” గబ్బర్ సింగ్ షూటింగ్ అనుకుంటా.. అప్పుడు నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆర్థిక ఇబ్బందులు.. ఇండస్ట్రీలో ఒకరు ఇద్దరికీ చెప్తే.. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలవండి అని చెప్పారు. ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అని అడగడానికి అక్కడకు వెళ్ళాను. నడవలేకపోతున్నాను.. వణికిపోతున్నా చలిలో.. నా కూతురితో పాటు వెళ్లి నిలబడ్డాను. అయితే లోపలికి పవన్ మేనేజర్ నన్ను వెళ్లనివ్వలేదు. చాలాసేపు బయట నిలబడ్డాను. ఆయన కోపంగా ఉన్నారు.. ఇప్పుడు వెళ్ళకండి.. బయటికి వచ్చాకా చూద్దామని చెప్పుకొచ్చారు. ఇక ఆయన క్యార్ వ్యాన్ ఎక్కే దగ్గర ఎదురుచూస్తున్నాను. అక్కడే బండ్ల గణేష్ కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసి మూడు సినిమాలు చేశాం.. ఇలా పవన్ ను కలవాలి అని అంటే.. ఆయన కూడా ఇప్పుడు కాదు.. ఆయన కోపంలో ఉన్నారు.. వెనక్కి వెళ్ళండి అని తోసేశాడు. ఇక నాకు కోపం వచ్చి.. వారిని తోసుకొని ముందుకు వెళ్లాను. అప్పటికే పవన్ .. జీప్ లో ఎక్కి వెళ్లిపోతున్నారు.
Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
ఇక ఇంకో అడుగు ముందుకేసి.. ముందుకు వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను చూసి.. జీప్ లో నుంచి అమాంతం దూకి.. ఆయన ఎప్పుడు నిదానంగా నడవరు.. పరిగెత్తడమే.. అలా రెండు జంప్స్ చేసి నా దగ్గరకు వచ్చి దండం పెట్టి.. ఏమ్మా .. మీరేంటి ఇక్కడ.. ఏమైంది.. అంతా ఓకేనా అని అడిగారు. లేదు బాబు.. ఆరోగ్యం సహకరించడం లేదు.. షూటింగ్ చేయలేకపోతున్నా.. ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇప్పిస్తారేమో అని అడుగుదామని వచ్చాను అని చెప్పాను. అంతే.. వెంటనే మేనేజర్ ను పిలిచి.. అమ్మకు రూ. 20 వేలు ఇచ్చి, కారు ఇచ్చి పంపించండి. రేపటిలోగా వారి ఇంటికి ఇంకో రూ. 80 వేలు పంపండి అని చెప్పారు. ఆయన నాకు ఇచ్చింది లక్ష రూపాయలు.. కానీ ఆ సమయంలో అది ఇవ్వడం చాలా గ్రేట్. అప్పుడు ఆయన రేణు దేశాయ్ తో గొడవల్లో ఉన్నాడు.. ఆర్థిక పరిస్థితి ఆయనదే బాగోలేదట.. అప్పుడు నాకు లక్ష ఇవ్వడం గ్రేట్ అన్ని అక్కడ ఉన్నవారు చెప్పుకొచ్చారు. పవన్ నాకు లక్ష ఇవ్వడం కన్నా.. నాకోసం ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడినది.. ఎన్ని కోట్లు ఇచ్చిన దక్కని ఆనందం. నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ అంత పరిచయం కూడా లేదు. సుస్వాగతం సినిమాలో ఒక చిన్న షాట్ లో కనిపిస్తాను.. అప్పుడు చూసిన ఆయన.. ఇన్నేళ్ళైనా నను గుర్తుపట్టి రావడం అనేది ఆయన గొప్పతనం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!