Pavala Shyamala About Sai Dharam Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్న అంశం తెరమీదకు వచ్చింది. సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకు ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు సాయి ధరమ్ తేజ్.…
Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్.
Pavala Shyamala: టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది పావలా శ్యామల. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది.
నటి పావలా శ్యామల దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. గతంలో పావల శ్యామల సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి 2లక్షలు రూపాయలు సాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా ఈ సాయం చేశారు. తాజాగా ఆమె పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసిన చిరు మరోసారి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు రూ. 1 లక్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు…