Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ లో సుధీర్ ఒకడు. తన మ్యాజిక్ తో, కామెడీతో ఒక్కో మెట్టు ఎదుగుతూ టీమ్ లీడర్ గా మరి సుడిగాలి సుధీర్ అనే టీమ్ తో మరింత హైప్ క్రియేట్ చేసి.. ఒక పక్క కమెడియన్ గా.. ఇంకోపక్క డ్యాన్సర్ గా, హోస్ట్ గా వ్యవహరిస్తూ.. హీరోగా మారాడు. నేనో రకం, సహస్త్ర, సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడువంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ తన కొత్త సినిమాను మొదలుపెట్టాడు. విశ్వక్ సేన్ తో పాగల్ లాంటి సినిమాతీసిన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మొదటి మూడు సినిమాలకు కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన సుధీర్.. ఈసారి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ తో జతకట్టడం విశేషం. దివ్య భారతి..మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను ఆమె ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.
Priyanka Chopra: నా 17 ఏళ్ళ వయస్సులో నా భర్త.. నన్ను చూస్తూ ఆ పని చేశాడట
ఇక సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోత గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గ్లామర్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పటినుంచో తెలుగు మీద కన్ను వేసింది.. ఎట్టకేలకు కుర్ర హీరో సుధీర్ తో జత కట్టింది. సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో దివ్య భారతి అతడి సరసన చేయడానికి ఒప్పుకోవడం మంచి నిర్ణయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.