సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన ఈ సినిమా. ఫిబ్రవరి 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. సందీప్ కిషన్, రావు రమేష్ ల కామెడీ నవ్వులు పూయించింది. నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. ఉగాది కానుకగా నేటి నుండి మజాకాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయి నాలుగు వారాలు కావంటంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచింది. ఈ నెల 28న అనగా నేటి నుండి మజాకా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీకెండ్ కు సరదాగా ఫ్యామిలీతో కలిసి నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకాను చూసి ఈ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేయండి.