తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిక్డ్స్ టాక్ వచ్చింది. కథ బాగున్నప్పటికీ కథనం బాలేదని టాక్ తెచుకుంది. అలా థియేటర్స్ లో ప్లాప్ గా మిగిలింది తెలుసు కదా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 14 నుండి అన్ని సౌత్ ఇండియా బాషలలో స్ట్రీమింగ్ కి తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్
డ్యూడ్ : ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా కీర్తిస్వారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ అందుకుంది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన డ్యూడ్ ఈ నెల 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప
బైసన్ : ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘బైసన్’ అక్టోబరు 17న రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు చేసి ధృవ్ విక్రమ్ కెరీర్ బిగ్గెస్ హిట్ గా నిలిచింది. ఇప్పడు ఈ సినిమా ఈ నెల 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
KRAMP : దీపావళి కానుకగా కిరణ్ అబ్బవరం KRAMP అనే మరొక యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ దీపావళికి పోటీలో మరో మూడు సినిమాలు ఉన్న కూడా సూపర్ హిట్ టాక్ తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ నెల 14 నుండి ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది.