Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ginger Candy: మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన టాబ్లెట్ల కంటే, ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకునే ఔషధమే మేలు. అందుకే ఎటువంటి పంచదార లేదా సాధారణ బెల్లాన్ని వాడకుండా, లో-గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే తాటి బెల్లంతో చేసే ‘అల్లం మురబ్బా’ (Ginger Candy) గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది రుచికి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి ఒక ‘సంజీవని’లా పనిచేస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ హెల్దీ రెసిపీ తయారీ విధానం, దాని అద్భుత ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
అల్లం: 100 గ్రాములు (శుభ్రం చేసి ముక్కలుగా కోసినవి)
Also Read
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
- Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
- Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
తాటి బెల్లం: 500 గ్రాములు (తురిమినది), (అల్లం, బెల్లం నిష్పత్తి 1:5 ఉండాలి)
బ్లాక్ సాల్ట్: అర టీస్పూన్ (లేదా సాధారణ ఉప్పు)
మిరియాల పొడి: అర టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
నీళ్లు: అర కప్పు (అవసరాన్ని బట్టి)
నెయ్యి: ట్రేకి అప్లై చేయడానికి సరిపడా
తయారీ విధానం:
అల్లం పేస్ట్:
ముందుగా అల్లం ముక్కలను మిక్సీ జార్లో తీసుకుని, అందులో బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, పసుపు వేసి, నీళ్లు అస్సలు పోయకుండా వీలైనంత మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
బెల్లం కరిగించడం:
స్టవ్ మీద పాన్ పెట్టి తాటి బెల్లం, అరకప్పు నీళ్లు పోసి కరిగించాలి. తాటి బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి, బెల్లం కరిగాక ఆ నీటిని వడకట్టి తిరిగి పాన్‌లోకి తీసుకోవాలి.
ఉడికించడం:
బెల్లం పాకం కొంచెం చిక్కబడటం మొదలయ్యాక, సిద్ధం చేసుకున్న అల్లం పేస్ట్‌ను అందులో కలపాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి సుమారు 30 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
పాకం:
పాకం చిక్కబడ్డాక కొంచెం నీళ్లలో వేసి చూస్తే, అది విరిచినప్పుడు సాగుతూ గట్టిగా ఉండాలి. ఈ స్టైల్ రాగానే స్టవ్ ఆపేయాలి. ఈ మురబ్బాను ఎయిర్ టైట్ జార్లో భద్రపరుచుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. రోజుకు ఒక చిన్న ముక్క చొప్పున వారంలో 3-4 సార్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అచ్చు వేయడం:
నెయ్యి రాసిన ఒక ట్రే లేదా ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా పరచాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా గాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక ముక్కలను వేరు చేయాలి.
అల్లం మురబ్బా ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ అల్లం మురబ్బా కేవలం రుచి కోసమే కాదు, ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీనిని భోజనం తర్వాత ఒక చిన్న ముక్క తీసుకోవడం వల్ల ఇండైజెషన్, గ్యాస్ మరియు బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి. ఇంకా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్, కండరాల నొప్పులు మరియు పీరియడ్ క్రాంప్స్ తగ్గుతాయి. మెటబాలిజంను పెంచి ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!