ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా ప్రకటించిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు తన ‘నెంబర్ 1’ స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్లు ఆడిన ప్రదర్శన ఆధారంగా తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంతో పోలిస్తే ఇండియా ఆధిక్యం స్వల్పంగా తగ్గడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. వార్షిక అప్‌డేట్ తర్వాత టీమిండియా ఒక రేటింగ్ పాయింట్‌ను కోల్పోయినప్పటికీ, ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ (113 పాయింట్లు) భారత్ కంటే కేవలం 5 పాయింట్ల దూరంలోనే ఉంది. దీంతో రానున్న నెలల్లో అగ్రస్థానం కోసం భారత్, కివీస్ మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.
టాప్-10 జట్ల వివరాలు:
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 109 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. టాప్ 10 జట్లు ఇవే..
1. భారత్ – 118 పాయింట్లు
2. న్యూజిలాండ్ – 113 పాయింట్లు
3. ఆస్ట్రేలియా – 109 పాయింట్లు
4. దక్షిణాఫ్రికా – 102 పాయింట్లు (పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టింది)
5. పాకిస్థాన్ – 98 పాయింట్లు
6. శ్రీలంక – 96 పాయింట్లు
7. అఫ్గానిస్థాన్ – 93 పాయింట్లు
8. ఇంగ్లాండ్ – 89 పాయింట్లు
9. బంగ్లాదేశ్ – 84 పాయింట్లు
10. వెస్టిండీస్ – 74 పాయింట్లు
2027 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ లక్ష్యంగా..
ఈ ర్యాంకింగ్స్ కేవలం అంకెలే కాదు, 2027 వన్డే ప్రపంచ కప్ నేరుగా క్వాలిఫై కావడానికి చాలా కీలకం. మార్చి 31, 2027 నాటికి ర్యాంకింగ్స్‌లో మొదటి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు ఎంట్రీ సాధిస్తాయి. ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా టాప్-8లో ఉంటే, 9వ స్థానంలో ఉన్న జట్టుకు కూడా నేరుగా అవకాశం లభించే అవకాశం ఉంది. ఇతర జట్లలో ఐర్లాండ్ మెరుగుపడి 11వ స్థానానికి చేరుకోగా, జింబాబ్వే 12వ స్థానానికి పడిపోయింది. అమెరికా (USA) 13వ స్థానంలో నిలవగా, యూఏఈ (UAE) 19వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ నంబర్-1 స్థానంలో ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా జట్లు టీమిండియాకు గట్టి పోటీనిస్తున్నాయి. రాబోయే వన్డే సిరీస్‌లలో భారత్ ఏమాత్రం తడబడకపోయినా, తన అగ్రస్థానాన్ని కాపాడుకోవచ్చు, లేదంటే కివీస్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టే ప్రమాదం ఉంది.
Key ramifications for the @cricketworldcup 2027 qualifications in the annual ICC Men's ODI Team Rankings update 👀https://t.co/2xMlGGRUcN
— ICC (@ICC) May 11, 2026
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!