Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారం కైవసం చేసుకున్న నాయకుడిగా ‘విజయ్ దళపతి’ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఆయనకు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ ఎందరో వ్యక్తులు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఆనంద సమయంలో తన కొడుకు, కూతురు నుంచి ఒక్కటంటే ఒక్క చిన్న మెసేజ్ కూడా పబ్లిక్‌గా రాకపోవడం చర్చకు తెరలేపింది. ఈ మేరకు ‘విజయ్’ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన తల్లికి మద్దతుగా నిలిచేందుకే ‘విజయ్’కు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా వేయలేదని, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయనని అన్ ఫాలో చేసి పారేశాడని కథనాలు మొదలయ్యాయి.
గతంలో ‘విజయ్’ భార్య ‘సంగీత’ విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు కూడా ‘తండ్రిని అన్ ఫాలో చేసిన కొడుకు…’ అంటూ సేమ్ ఇలాగే వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి, ‘జాసన్ సంజయ్’ తన తండ్రిని సోషల్ మీడియాల్లో ఇప్పటివరకు ఫాలో అనేది చేసిందే లేదు. అతను ఫాలో అయ్యే 38 ఖాతాల్లో నటుడు ‘విజయ్ సేతుపతి’ ఉండటం, తండ్రి ‘విజయ్ దళపతి’ లేకపోవడంతో తండ్రిని అన్ ఫాలో చేశాడని అంటున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా ‘జాసన్’ తన తండ్రికి అభినందనలు తెలపకపోవడం అనేది మాత్రం వాస్తవం.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
పైగా అంగరంగ వైభవంగా జరిగిన ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా విజయ్ కొడుకు, కూతురు గైర్హాజరు కావడం, స్నేహితురాలైన నటి త్రిష మాత్రం హాజరై బాగా హడావిడి చేయడం ఈ అన్ ఫాలో చర్చను మరింత రసవత్తరం చేసింది. దీంతో మదర్స్ డే నాడు ‘విజయ్’ను ఉద్దేశిస్తూ ఓ కొడుకు తన తల్లికి మర్చిపోలేని బహుమతి ఇస్తే… మరో కొడుకు (అంటే ‘జాసన్ సంజయ్’ను ఉద్దేశించి) తన తల్లికి ధైర్యం నింపే సానుభూతి ప్రకటించాడు… అంటూ కథనాలు స్టార్ట్ చేశారు.
‘విజయ్’ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలపై ఇటువంటి వార్తలు ఎక్కువయ్యాయి. వాటిలో కొన్ని నిజం ఉంటే, మరికొన్ని ఫేక్ ఎలిగేషన్సే. ఇక ‘విజయ్’ భార్య ‘సంగీత’ నివాస సౌకర్యంతో పాటు భారీగా భరణం కోరుతూ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ విచారణను కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. దీంతో ‘సంగీత’, ‘జాసన్ సంజయ్’ లండన్‌లోనే ఉంటున్నారు. ఇక కూతురు ‘దివ్య శాష’ అయితే ఎప్పటినుంచో లండన్‌లోనే చదువుకుంటోంది.
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!