New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓటీటీ (OTT) అనేది నిర్మాతలకు ఒక సేఫ్టీ నెట్లా ఉండేది. సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడకపోయినా ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే భారీ మొత్తంతో నిర్మాతలు గట్టెక్కేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు విధిస్తున్న కొత్త నిబంధనలు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పెద్ద హీరోల నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఓటీటీ సంస్థలు ఇప్పుడు కేవలం ‘స్టార్ పవర్’ చూసి కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా లేవు. మార్కెట్ ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని పక్కా బిజినెస్ లెక్కలతో ముందుకు వెళ్తున్నాయి. దీనివల్ల భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. గతంలో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ముందే అగ్రిమెంట్లు జరిగేవి. కానీ ఇప్పుడు “పెర్ఫార్మెన్స్ బేస్డ్ డీల్స్“ అమల్లోకి వస్తున్నాయి. అంటే ఒక సినిమా థియేటర్లలో ఎంత వసూలు చేసింది అనే దానిపైనే ఓటీటీ రేటు ఆధారపడి ఉంటుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయితే ఓటీటీ సంస్థలు ఇచ్చే పారితోషికంలో భారీగా కోత విధిస్తున్నాయి. అంతేకాకుండా సినిమా విడుదల ఆలస్యమైతే అగ్రిమెంట్లు రద్దు చేసుకోవడం లేదా రేట్లు తగ్గించడం వంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
Also Read
ఒకప్పుడు థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభించేది. “థియేటర్లో మిస్ అయ్యాం, ఓటీటీలో చూద్దాం” అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. థియేటర్లో డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలను ఓటీటీలో కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకుఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘రాజాసాబ్’ వంటి చిత్రాలు థియేట్రికల్ రన్లో ఆశించిన స్థాయిలో రాణించకపోగా ఓటీటీలోనూ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీనివల్ల ఓటీటీ సంస్థలకు భారీగా సబ్స్క్రిప్షన్ నష్టాలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి పరిష్కారం ఒక్కటే.. అదే బడ్జెట్ నియంత్రణ. ఓటీటీ మార్కెట్‌ను నమ్ముకుని వందల కోట్ల బడ్జెట్ పెంచడం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. సినిమా మేకింగ్ ఖర్చు తగ్గించుకోవాలంటే హీరోలు తమ భారీ రెమ్యునరేషన్లను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే సినిమా ఏమాత్రం తేడా కొట్టినా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలోనూ నిర్మాతలకు నష్టాలు తప్పవు. మరి మన స్టార్ హీరోలు ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!