8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMAGIC 11S Pro: గేమింగ్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి చెందిన రెడ్‌మ్యాజిక్ (REDMAGIC) సంస్థ తన కొత్త REDMAGIC 11S Pro సిరీస్ స్మార్ట్ఫోన్లను మే 18న చైనాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ ఫోన్ల డిజైన్‌ను కూడా అధికారికంగా వెల్లడించింది. ప్రీమియం లుక్‌తో పాటు పవర్ఫుల్ గేమింగ్ ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. REDMAGIC 11 Pro సిరీస్‌లో కనిపించిన ఫ్యామిలీ-స్టైల్ డ్యూటీరియం బ్లేడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్‌ను ఈ కొత్త సిరీస్‌లో కూడా కొనసాగించింది. ఫోన్లో డ్యూయల్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. సిల్వర్ వింగ్, డార్క్ నైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సిరీస్‌లోని ఫోన్లు Snapdragon 8 Elite Gen 5 Leading ఎడిషన్ ప్రాసెసర్‌తో రానున్నట్లు కంపెనీ ఇప్పటికే కన్ఫామ్ చేసింది. గేమింగ్ సమయంలో అధిక వేడి సమస్యలను తగ్గించేందుకు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, వాటర్ కూలింగ్ డిజైన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాదు 2K 144Hz సూపర్ రెజల్యూషన్, సూపర్ ఫ్రేమ్ సపోర్ట్‌తో మొబైల్ గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచనుంది. ఇక REDMAGIC 11S Pro+ Geekbench 6 బెంచ్‌మార్క్ లిస్టింగ్ కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. Nubia NX809J మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ ఫోన్ సింగిల్ కోర్లో 4010 స్కోర్, మల్టీ కోర్లో 11187 స్కోర్ సాధించింది. Geekbench 6 సింగిల్ కోర్ టెస్టింగ్‌లో 4000కి పైగా స్కోర్ సాధించిన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదేనని సమాచారం.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. REDMAGIC 11S Pro+లో 6.85 అంగుళాల 1.5K 144Hz AMOLED డిస్ప్లే ఉండనుంది. 7500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనున్నాయి. అదే REDMAGIC 11 Pro మోడల్లో 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్లు పవర్ఫుల్ ఆప్షన్‌గా మారనుంది. ఈ ఫోన్ల ధరలు, పూర్తి వివరాలు వచ్చే వారం (మే 18) అధికారిక లాంచ్ సందర్భంగా తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?