టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా, ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ వేరు. స్టార్ కాంబినేషన్స్ తో సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దిల్ రాజు ఇటివలే కాలంలో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దళపతి విజయ్ తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ‘వారిసు’ సినిమానే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్ లాంటి సమయాల్లో తెలుగు సినిమాలకే ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలి అనే దగ్గర మొదలైన ఈ గొడవ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెంచేలా కనిపిస్తోంది. సంక్రాంతికి ‘వారిసు’ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలిసే వరకూ ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉంటుంది.
ప్రస్తుతం ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న దిల్ రాజు, ఒక ఇంటర్వ్యూలో నైజాంలో అందరు హీరోలు రాణించట్లేదు. 2000 సంవత్సరం నుంచి ఒకరిద్దరు హీరోలకి మాత్రమే ఇక్కడ మార్కెట్ ఉందంటూ మాట్లాడాడు. ఇప్పుడు దిల్ రాజు చెప్పిన ఆ నైజాం కింగ్ హీరో ఎవరు అనే టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఏ హీరో ఫాన్స్ తమ హీరోకే నైజాంలో మార్కెట్ ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నిజానికి మెగాస్టార్ కి నైజాం చాలా స్ట్రాంగ్ జోన్, ఆయన నటించిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా నైజాంలో మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. ఈ జనరేషన్ హీరోల్లో ప్రభాస్ కి నైజాంలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రభాస్ సినిమాలు నైజాంలో భారి వసూళ్లని రాబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ లిస్టులో మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు ఉన్నారు. వీరిలో సినిమా టాక్ ని బట్టి, ఒక్కో హీరో ఒక్కోసారి మంచి ఓపెనింగ్స్ ని రాబడుతూ ఉంటాడు. మరి ఈ హీరోల్లో ఎవరి గురించి మాట్లాడాడో దిల్ రాజుకే తెలియాలి. నైజాంలో పరిస్థితి ఇలా ఉంటే ఎన్టీఆర్, బాలయ్య, చరణ్ లాంటి మాస్ హీరోలకి ‘సీడెడ్’ స్ట్రాంగ్ జోన్. ఈ అడ్డాలో ఎన్టీఆర్, చరణ్ లని బీట్ చేయడం కష్టమైన విషయమే. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ‘సీడెడ్’ లో డే 1 ఆల్ టైం రికార్డ్ ని పెట్టగల సత్తా ఈ ఇద్దరు హీరోలకి మాత్రమే ఉంది.