వైజయంతి మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రభాస్ అభిమానులు ‘ప్రాజెక్ట్ K’ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అని ఆశగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఆశని నిరాశ చేస్తూ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ఒక్క అప్డేట్ లో కూడా ప్రభాస్ ని చూపించలేదు మేకర్స్. కనీసం సెట్ లో ప్రభాస్ ఉన్న ఫోటో కూడా బయటకి రాలేదు. ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క పిక్ లీక్ కాకుండా సెట్స్ లో షూటింగ్ ని చెయ్యడం అనేది మాములు విషయం కాదు. రాజమౌళి అంతటి వాడికే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల సమయంలో లీకుల బెడద తప్పలేదు. సలార్ సినిమా విషయంలో కూడా లీకులు బాగానే బయటకి వచ్చాయి, రీసెంట్ గా మొదలైన మారుతీ-ప్రభాస్ సినిమా షూటింగ్ నుంచి కూడా ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఇలా లీక్ అనేది సర్వ సాధారణం అయిపోయిన రోజుల్లో ‘ప్రాజెక్ట్ K’ సెట్స్ నుంచి లీక్ బయటకి రాకుండా నాగ్ అశ్విన్ తీసుకుంటున్న జాగ్రత్తలని అభినందించాల్సిందే. అయితే లీకుల విషయంలో జాగ్రత్తలు ఒకే కానీ ఒక్క అప్డేట్ లో కనీసం సైడ్ ఫేస్ అయినా చూపిస్తే ప్రభాస్ ఫాన్స్ కాస్త హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటివరకూ చేతులు, కాళ్లు, నీడలు, టైర్లు మాత్రమే చూపిస్తున్నారు. ఇదే లిస్టులో సంక్రాంతి అప్డేట్ కూడా చేరింది.
ప్రాజెక్ట్ K మూవీలో అమితాబ్ బచ్చన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి(జల్సా) ముందు ప్రతి ఆదివారం కొన్ని వేల మంది అభిమానులు అమితాబ్ ని చూడడానికి వెయిట్ చేస్తుంటారు. అభిమానులకి కనిపించి, అందరికీ హాయ్ చెప్పడం అమితాబ్ కి కొన్నేళ్లుగా ఉన్న అలవాటు. ఆ అలవాటులో భాగంగానే గత ఆదివారం అమితాబ్ బచ్చన్, తన ఇంటి ముందు ఎదురు చూస్తున్న అభిమానులని కలిశాడు. ఈ సంధర్భంగా బిగ్ బి ‘ప్రాజెక్ట్ K’ టీషర్ట్ వేసుకున్నాడు. ప్రతి ఆదివారం ఇలానే ఉంటుంది అని అమితాబ్ బచ్చన్, సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. అమితాబ్ ట్వీట్ లోని ఫోటోని తీసుకోని వైజయంతి మూవీ ‘సంక్రాంతి’ అని ట్వీట్ చేసింది. ఈ అప్డేట్ చూడగానే ఎదో ఒక అప్డేట్ ఇవ్వు నాగ్ అశ్విన్ బ్రో అంటూ ప్రభాస్ ఫాన్స్ కామెంట్ సెక్షన్ లో తమ బాధని వెల్లడిస్తున్నారు. మరి అభిమానుల రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ అప్డేట్ ని బయటకి ఎప్పుడు వాడులుతాడో చూడాలి.
𝐬𝐚𝐧𝐊𝐫𝐚𝐧𝐭𝐡𝐢 ♥️@SrBachchan #ProjectK https://t.co/QdfLhdJNtg pic.twitter.com/qcukL3dDOo
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 16, 2023