సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వాలిమై’. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కరోనా కారణంగా విడుదల వాయిదా పడగా, ఇప్పుడు అభిమానులు కొత్త విడుదల తేదీ, ట్రైలర్‌ల అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న పొంగల్‌కు విడుదల కావాల్సిన ‘వాలిమై’ ఓమిక్రాన్ వైరస్ కారణంగా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. “వాలిమై” ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Read Also : ‘రాధే శ్యామ్’కి బాట్‌మ్యాన్ దెబ్బ!?
‘వాలిమై’ని మొదట తమిళం, తెలుగు భాషలలో మాత్రమే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే మేకర్స్ ఇప్పుడు దీనిని డబ్ చేసి హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వాలిమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే.
బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వాలిమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వాలిమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి హుమా ఖురేషి కథానాయిక. హిందీ ట్రైలర్‌లను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు.