దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. ఆయన అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అజిత్ యూ సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా అజిత్ సాంప్రదాయ దుస్తువుల్లో మెరిసిపోతున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజిత్ తాజాగా కేరళలోని ఓ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారట. వైరల్ అవుతున్న ఫొటోల్లో అజిత్ తెల్లటి గడ్డంతో తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి…
సౌత్ సినిమా పరిధి పెరిగింది. కొంతకాలం నుంచి సినిమాపై పెట్టే పెట్టుబడి, అలాగే హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాము. అయితే మన స్టార్స్ లో 100 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకునే హీరోలు కూడా ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ మీడియాలో అజిత్ తన…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వలిమై’. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ మూవీ తమిళనాడులో భారీ కలెక్షన్‌లను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈనెల 25 నుంచి వలిమై స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ5 సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. వలిమై సినిమాలో టాలీవుడ్…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అజిత్ హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక నేటితో అజిత్ చిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అజిత్ తన అభిమానులకు, హేటర్స్ కు, ఇతరులకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం ఇచ్చారు. స్టార్ అజిత్ పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘వాలిమై’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అజిత్ థియేటర్‌లలోకి తిరిగి వచ్చినందుకు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, అజిత్ తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “AK61” అని పేరు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా అజిత్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో నెటిజన్లను…
కార్తికేయ… ‘ఆర్.ఎక్స్.100’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీలో హీరోగా నటించినా, గుర్తింపు మాత్రం ‘ఆర్. ఎక్స్. 100’తోనే వచ్చింది. ఆ గ్రాండ్ సక్సెస్ కారణంగా కార్తికేయ గత మూడేళ్లుగా వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతనిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తీయాలనుకున్న దర్శకులు, యాక్షన్ డ్రామాలు చేయాలనుకున్న నిర్మాతలు క్యూ కట్టారు. అలా వచ్చిన ‘హిప్పీ’, ‘గుణ 369′,…
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో…
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” ఫిబ్రవరి 24న వెండితెరపైకి రానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజిత్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందు అజిత్ కుమార్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. వారి రివ్యూ ఏంటి ? వాళ్ళు ఎలా స్పందించారు ? అన్న విషయాన్ని ‘వాలిమై’ దర్శకుడు హెచ్ వినోద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను.…
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తారంటూ పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏ అప్డేట్…