Nuvve Naa Pranam Pre Release Event Highlights: వరుణ్ కృష్ణ ఫిల్మ్స్‌పతాకంపై సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రధారులుగా శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వే నా ప్రాణం!. కిరణ్‌రాజ్, ప్రియాహెగ్డే హీరోయిన్లు. ఈ చిత్రం 30న విడుదల కానున్న సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘2019 లో షూటింగ్ ప్రారంభమైంది. కోవిడ్ తో ఆలస్యం అయింది. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్30న విడుదల చేస్తున్నాం’ అన్నారు. హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ ‘ఇది నా తొలి చిత్రం. ఇందులో లెజండరీ నటీనటులతో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. మంచి అవకాశాన్నిచ్చిన ఈ చిత్ర దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు.
భానుచందర్ మాట్లాడుతూ సివిల్ ఇంజనీర్ అయిన డైరెక్టర్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడని అన్నారు. సుమన్ మాట్లాడుతూ ‘నేను భానుచందర్ ఇద్దరం కూడా మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులం. అందువల్ల మేమిద్దరం ఎక్కవ దగ్గరయ్యాం. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నాం. తమిళంలో నాలుగైదు చిత్రాల్లో నటించాము. తెలుగులో మరోసారి మేమిద్దరం కలసి నటించటం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ మల్లి, లిరిసిస్ట్ వెంకట్, సీనియర్ నటుడు తిలక్, శ్వేతా శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ మణిజెన్నా పాల్గొన్నారు.