యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, శ్రీకాంత్… ఇతర మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో… దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కీలక భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్ లో శ్రీకాంత్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఇదే విషయాన్ని బిగ్‌బాస్ స్టేజ్ మీద చెప్పాడు శ్రీకాంత్. గోవాలో దేవర షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని… ఇసుక దిబ్బలో పరిగెడుతుంటే కాలు బెణికిందని చెప్పాడు. అయినా కూడా షూటింగ్ చేశాడట శ్రీకాంత్… నిలబడే డైలాగ్స్ చెప్పాడట. ఇదిలా ఉంటే దేవరకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
దేవర సినిమాలో యంగ్ టైగర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. అందులో ఓ లుక్ ఓల్డ్ గెటప్‌లో ఉంటుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సీక్వెన్స్ ఇంటర్వెల్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. శ్రీకాంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్… ఫ్లాష్ బ్యాక్‌కి లీడ్ ఇస్తుందని… సినిమాలో ఇది గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అసలు… ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని, ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ అదిరిపోనుందని టాక్. అయితే ఓల్డ్ గెటప్ అంటూ దేవర సినిమాలో ప్రత్యేకంగా లేకపోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ రెండు లుక్స్ లో ఒకటి యంగ్ లుక్ అవ్వగా… ఇంకొకటి ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూసిన లుక్. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపించే అతనే దేవర టైటిల్ రోల్ ప్లే చేస్తుండొచ్చు. ఈ రెండు లుక్స్ కాకుండా ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కొరటాల శివ నుంచి వస్తే చెప్పలేం.