యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలుకు గాయం కావడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొద్దిరోజులు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. మరో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్న ఎన్టీఆర్ అనంతరం కొరటాల శివ షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇకపోతే దీపావళి పండుగరోజు అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తన వారసులతో దిగిన ఫోటోని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజీతో కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.