ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాటు నాటు అవార్డ్ గెలిచిన ఆనందంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆఫ్టర్ పార్టీలో సందడి చేశారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్నింటికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఒకటుంది. యంగ్ టైగర్ గా ఇండియాలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు అయిన ‘మైఖేల్ బీ జోర్డాన్’తో కలిసి ఒక ఫోటో దిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. బ్లాక్ పాంథర్ యాక్టర్ తో యంగ్ టైగర్ అంటూ నందమూరి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని ‘బ్లాక్ పాంథర్’ సినిమా ఇండియన్ ఎమోషన్స్ తో నిండి ఉంటుంది. ఇందులోని ఏ క్యారెక్టర్ లో అయినా ఎన్టీఆర్ సెట్ అవుతాడు. సో ఎన్టీఆర్ ని బ్లాక్ పాంథర్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వు అన్న అంటూ నందమూరి అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఫాన్స్ కోసం ఫ్యూచర్ లో అలాంటి న్యూస్ ఏమైనా వినిపిస్తుందేమో చూడాలి.