NTR: నందమూరి కళ్యాణ్ రామ్.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. గతేడాది బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ తో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. కానీ, వెనకడుగు వేయకుండా ఈసారి డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిషేక్ నామా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. కళ్యాణ్ రామ్, సంయుక్త వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక రెండు రోజుల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బింబిసార, అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఎన్టీఆర్ వచ్చి ఎంత సందడి చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ను హీరోగా నిలబెట్టడానికి తారక్ తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సైతం.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాల కోసం కష్టపడుతున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం డెవిల్ కోసం దేవర వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. క్రిస్టమస్ నుంచి సంక్రాంతి వరకు పిల్లలకు సెలవులు ఎక్కువగా ఉండడంతో.. కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడట తారక్. దీని వలన డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ రాకపోవచ్చని చెప్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.