ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ, ఒక్కసారి ఏదైనా విషయాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతూనే ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ అని. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్ అయ్యి తీరుతుందనేది తెలుగు సినీ అభిమానుల నమ్మకం, హిస్టరీ చెప్తున్నది నిజం కూడా. అయితే ఈ సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అవుతుంది, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మా హీరో చేసే సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నందమూరి అభిమానులు. ఏ హీరోతో ఈ సెంటిమెంట్ మొదలయ్యిందో, అదే హీరోతో ఈ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాం అని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. రాజమౌళి ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ సెకండ్ సినిమాగా రిలీజ్ అయిన ‘స్టూడెంట్ నంబర్ 1’ తర్వాత వచ్చిన ‘సుబ్బు’ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ‘సింహాద్రి’ తర్వాత రిలీజ్ అయిన ఆంధ్రావాలా సినిమా రిజల్ట్ ఏం అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘యమదొంగ’ హిట్ అయ్యింది కానీ ఆ తర్వాత వచ్చిన కంత్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ ని రాబట్టలేకపోయింది. ఇలా రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేసి హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఆ తర్వాత ఎక్కువ ఫ్లాప్స్ ని కూడా ఫేస్ చేశాడు. ఈసారి మాత్రం అలా కాదు, హిట్ టార్గెట్ మిస్ అవ్వదని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ‘ఎన్టీఆర్ 30’ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 31 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఇన్నేళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ని నెక్స్ట్ సమ్మర్ కి మేము బ్రేక్ చేస్తాం అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మరి నందమూరి అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తూ రాజమౌళి సెంటిమెంట్ కి భారీగా బలైన కొరటాల శివ, ఎన్టీఆర్ ని అయినా కాపాడుతాడేమో చూడాలి.