Naga Chaitanya: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతోమంది అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా.. ఈ వేడుకకు అక్కినేని సుమంత్, నాగ చైతన్య ముఖ్య అతిధులుగా విచ్చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని హీరోగా కొనసాగుతున్న నాగ చైతన్య ఈ వేడుకలో మాట్లాడుతూ.. తన తాత ఏఎన్నార్ కు, ఎన్టీఆర్ కు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ను గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకులకు తాను రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
Rs.2000 Notes: విజయ్ ఆంటోని అన్నా.. నువ్వేమైనా జ్యోతిష్కుడివా..
“ఎన్టీఆర్ శతజయంతి వేడుకుల్లో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ మూల స్థంభం. ఆయన అందం, ఆయన వాక్చాతుర్యం, ఆయన క్రమశిక్షణ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మీ అందరికి తెలుసు. నాకు కృష్ణుడు, రాముడు అని ఎవరైనా చెప్తే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. మా తాత ఏఎన్నార్ ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ గురించి గౌరవంగా మాట్లాడే వారు. వారి ఫ్రెండ్ షిప్ చూసి నాకు ముచ్చటేసేది. ఇక తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చారు. ఒక నటుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్లో దేవుడు లాంటి మంచి ఎన్టీఆర్. ఈ అవకాశం ఇచ్చిన నందమూరి కుటుంబానికి ధన్యవాదాలు అని ముగించాడు.