NTR: సినిమా అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చినట్టు ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాల పోస్టర్లు, టీజర్లు, సంక్రాంతి సినిమాల ట్రైలర్లు, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు.. ఇండస్ట్రీ మొత్తం కళకళలాడుతోంది. ఇక ఈ సంక్రాంతికి ఎలాంటి సంబంధం లేని దేవర.. నేడు గ్లింప్స్ తో వచ్చేస్తుంది. నిన్న మొత్తం గుంటూరు కారం ట్రైలర్ రచ్చ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు దేవర సంభవం మొదలుకానుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అప్డేట్ అప్డేట్ అంటూ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రచ్చ చేశారో అందరికి తెల్సిందే. అలాంటిది అప్డేట్ వస్తుంది అంటే వదులుతారా.. ? ఉదయం నుంచి దేవర, ఎన్టీఆర్, దేవర స్ట్రోమ్ బిగిన్స్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. మొదటి నుంచి కూడా దేవర పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. సరదా సరదాకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరను ట్రెండ్ చేస్తారు.. ఇప్పుడు దేవర గ్లింప్స్ అంటున్నారు.. చూసుకోండి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ గ్లింప్స్ వచ్చాకా సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మరి దేవర గ్లింప్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.