యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా, ఎలాంటి సీన్ లో అయినా అద్భుతంగా నటించిన మెప్పించడం తారక్ గొప్పదనం. ఇప్పటివరకూ ఎన్టీఆర్ లుక్స్ పరంగా ఏదైనా నెగటివ్ కామెంట్స్ వినిపించాయేమో కానీ నటన పరంగా ఎన్టీఆర్ ఇండియాలోని ది బెస్ట్ యాక్టర్. ఎన్టీఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే కాదు అతని కనుబొమ్మలు కూడా నటించగలవు. ఈ మాట మేము చెప్పట్లేదు, దర్శక ధీరుడిగా ఇండియన్ ఫిల్మ్ గ్లోరినీ వెస్ట్ ఆడియన్స్ కి పరిచయం చేసిన రాజమౌళి అంటున్న మాట. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా రాజమౌళికి ఎన్టీఆర్ కూడా తోడయ్యాడు.
Read Also: Akkineni Nagarjuna: నాగార్జునతో పూజాహెగ్డే వ్యాపారం
ఆస్కార్ వోటింగ్ క్యాంపెయిన్ లో భాగంగా జరిగిన ఒక మీడియా ఇంట్రాక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ… “తన కెరియర్ మొత్తంలోనే కొమురం భీముడో సాంగ్ ది బెస్ట్ అని, ఆ సాంగ్ అంత బాగా రావడానికి కారణం ఎన్టీఆర్ మాత్రమే. కెమెరాని కనుబొమ్మల పైన మాత్రమే పెట్టినా, వాటితో కూడా యాక్టింగ్ చెయ్యగల సత్తా ఎన్టీఆర్ కి ఉంది. అతను అంత గొప్ప యాక్టర్” అంటూ రాజమౌళి, ఎన్టీఆర్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు. జక్కన్న అంతటి డైరెక్టర్ ఎన్టీఆర్ నటన గురించి వెస్ట్ మీడియా ముందు పొగిడితే సోషల్ మీడియా సైలెంట్ గా ఉంటుందా చెప్పండి, షేక్ అయిపోదు. ఇప్పుడు జరిగింది కూడా అదే, రాజమౌళి మాటలని వైరల్ చేస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో హల్చల్ చేశారు. ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్, డౌట్ ఉంటే ఇండియాలోని అందరికన్నా గొప్ప దర్శకుడు చెప్పిన ఈ మాటలని వినండి అంటూ ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ఇండియా నుంచి ఆస్కార్ ప్రిడిక్షన్స్ టాప్ 10లో చోటు సంపాదించిన మొట్ట మొదటి యాక్టర్ గా చరిత్ర సృష్టించాడు. వెరైటీ మ్యాగజైన్ ప్రచురించిన ఆర్టికల్ నెట్ లో వైరల్ అవుతూ ఉంది.
Read Also: Veera Simha Reddy: మాస్ మొగుడు వచ్చేస్తున్నాడు…