గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…
ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం ఆయనకు అలవాటు. ఆయన ఏ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేస్తారనేది చెప్పడం కష్టం ఏమీ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ వెళ్ళేటప్పుడు ఓ అభిమాని అన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాడు.. వెంటనే ఎన్టీఆర్ అతని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.. ఆ సమయంలో అక్కడున్న మీడియాలో ఈ దృశ్యం రికార్డు అయ్యింది..
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. దేవర సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. అలాగే హృతిక్ రోషన్, ఆయన హీరోలుగా ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. చిత్రీకరణలో సినిమా బిజీగా ఉంది..