‘ఎం. ఎస్. థోని, సంజు, నీరజ్, చిచ్చోరే’ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్. అయితే ఈ సంస్థ ఇకపై స్టార్ స్టూడియోస్ గానే వ్యవహరించబోతోందని తాజా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సరికొత్త ప్రయాణంలో మరింత అగ్రెసివ్ గా సంస్థ ముందుకు సాగబోతోంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటు డైరెక్ట్ డిజిటల్ కంటెంట్ పైనా స్టార్ స్టూడియోస్ దృష్టి పెట్టబోతోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయబోతోంది. అందులో భాగంగానే ఇప్పటికే ‘బ్రహ్మాస్త్ర: శివ’, ‘బబ్లీ బౌన్సర్’, గుల్ మొహార్’ చిత్రాలను నిర్మిస్తోంది.
అలానే మలయాళ చిత్రం ‘హృదయం’ను రీమేక్ చేయబోతోంది. మరిన్ని సినిమాలకు సంబంధించిన చర్చలూ జరుపుతోంది. ఇతర సంస్థలతో కలిసి క్రియేటివ్ పర్శన్స్ సాయంతో అన్ని రకాల జానర్స్ లోనూ, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే చిత్రాలను నిర్మించాలన్నది తమ ఆలోచన అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ తెలిపారు. అతి త్వరలోనే స్టార్ స్టూడియోస్ చేపట్టబోయే మరిన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించిన వివరాలను తెలియచేస్తామంటున్నారు.