ఈ ఏడాది నవ్వులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లి రాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో వైపు గడుసు పెళ్లాంగా బాగా ఆకట్టుకుంది. నలుగురు పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది.
Also Read : ARYA -2 : ఆర్య 2 రీరిలీజ్.. సంధ్య థియేటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్త్
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ లో ఐశ్వర్య బిజీగా మారిపోతుందేమో అనుకుంటే ఇప్పటి వరకు ఒక్క తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సుడుల్ వెబ్ సిరీస్‌తో పలకరించింది ఐశ్వర్య. తెలుగమ్మాయిగా తెలుగులో సినిమాలు చేయాలని తన వంతు ప్రయత్నిస్తున్నా ఆఫర్లు మాత్రం రావట్లేదో ఇవ్వట్లేదో తెలియట్లేదే. గతంలో ఓసారి టాలీవుడ్ నుండి ఛాన్సులు రాకపోవడంపై బహిరంగానే అసహనం వ్యక్తం చేసింది ఐషూ. కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ తెరంగేట్రం చేసి ఆరేళ్లవుతున్నా పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు ఐశ్వర్య. తెలుగు కాదంటోన్నా, తమిళంలో వరుస ఆఫర్లను కొల్లగొడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆమెకు మూడు సినిమాలున్నాయి. కరూప్పార్ నగరం, మోహన్ దాస్ షూటింగ్స్ కంప్లీట్ కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే తీయవర్ కులైగల్ నడుంగ చేస్తుంది. అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ షైనింగ్ బ్యూటీ. ఉత్తరాఖండ సినిమా ఎప్పుడో స్టార్టైనా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. మరి టాలీవుడ్ లో ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి.