ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అప్పటి నుండి మరి ట్రైలర్ సంగతి ఏమిటనే ప్రశ్న పవర్ స్టార్ అభిమానులలో కొట్టిమిట్టాడుతోంది. దానికి సమాధానం లభించింది. ముందు అనుకున్న సమయానికే ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాత్రి 8.10 నిమిషాలకు ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ కాబోతోంది. సో… పవర్ స్టార్ అభిమానులంతా ఇప్పటి నుండే ఆ ట్రైలర్ కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు.