హీరోయిన్ నిత్య మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది నిత్యా మీనన్. టాలీవుడ్ లోను దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి మంచి ఫేమ్ ఏర్పరుచుకుంది నిత్య. కానీ చాలా కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న నిత్యా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తోంది. 2022 లో తమిళ్ లో ధనుష్ తో నటించిన ‘తిరు’ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న నిత్య వ్యవహారం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తెస్తుంది.
Also Read : Daaku Maharaaj : నేడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?
విషయం ఏమిటంటే జయం రవి హీరోగా నిత్యామీనన్ హీరోయిన్ ‘కాదలిక్క నేరమిల్లై’ అనే సినిమాలో నటించింది. తాజాగా నిత్యా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైంది. అయితే అక్కడి ఈవెంట్ మేనేజర్ ఆమెను చూడగానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నిత్య మీనన్ మాత్రం తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరింస్తూ సోషల్ డిస్టెన్స్ అని ఏవో కారణాలు చెప్పింది. అయితే అదే ఈవెంట్ లో ఆమె డైరెక్టర్ మిష్కిన్ ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని హగ్ కూడా చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అయిపోయింది . వ్యక్తి స్థాయిని బట్టి నిత్య ప్రవరిస్తుందని, ఇది సరైనది కాదని నెటిజన్లు నిత్యా మీనన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.