నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులతో సతమతమౌతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలనే నమ్ముకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న నితిన్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ షేర్ చేసుకున్నాడు.
Also Read : Faria : పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసి రావట్లేదా..?
నితిన్ ప్రజెంట్ తమ్ముడు సినిమా చేస్తున్నాడు. అలాగే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మకు కమిటయ్యాడు. ఈ రెండు డిఫరెంట్ జోనర్స్. తమ్ముడు యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇక ఎల్లమ్మ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఈ రెండే కాకుండా ఇష్క్ ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రీసెంట్ ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు నితిన్. విక్రమ్ చెప్పిన కథ చెప్పినట్లు స్క్రీన్ పైకి వస్తే తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే బొమ్మ అవుతుందని స్ట్రాంగ్‌గా చెప్పాడు నితిన్. ఇష్క్ తర్వాత విక్రమ్ కె కుమార్‌తో పుష్కర కాలం తర్వాత వర్క్ చేయబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో. సై తర్వాత నితిన్ నటించిన ఇంచు మించు డజను సినిమాలు ప్లాప్స్ అయ్యాయి. యంగ్ హీరో గ్రాఫ్ డౌన్ అవుతున్న సమయంలో విక్రమ్ కె కుమార్ నితిన్ కెరీర్‌కు ఇష్క్ రూపంలో భారీ యూటర్న్ ఇచ్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుంది. ఈ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు టాక్. అలాగే యువి ప్రొడక్షన్ భారీగా ప్లాన్ చేస్తుందని సమాచారం.